Header Banner

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్కడ 450 ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటు.! ఐదు లక్షల మంది యువతకు..

  Fri Apr 18, 2025 21:27        Politics

హైద‌రాబాద్ అన‌గానే ముందుగా అక్క‌డి వార‌స‌త్వ సంప‌ద‌, 500 ఏళ్ల చ‌రిత్ర‌తో పాటు హైటెక్ సిటీ గుర్తుకురావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. దేశంలో టాప్ ఐటీ కంపెనీలున్న న‌గ‌రాల్లో ఒక‌టిగా పేరుగాంచిన హైద‌రాబాద్‌లో ఇప్పుడు మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.  ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏకంగా 450 ఎక‌రాల్లో ఐటీ నాలెడ్జ్ హ‌బ్ ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌ల ప‌రిధిలోని పుప్పాలగూడ పరిసరాల్లో మొదటిదశలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జి హబ్‌ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎస్‌ శాంతికుమారి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

ఇది కూడా చదవండి: పాస్‌పోర్ట్ నిబంధనల్లో సంచలన మార్పులు.. బార్కోడ్ భద్రతపై కేంద్రం బిగ్ స్టెప్! అధునాతన టెక్నాలజీతో..!

 

పుప్పాలగూడ ప‌రిస‌రాల్లో ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు, పలు సొసైటీలకు దాదాపు 200 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయింపులు చేయగా.. ఇటీవల సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసిందని అధికారులు తెలిపారు. ఈ భూమి పక్కనే పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు చెందిన మరో 250 ఎకరాలు ఉండటంతో ఇక్కడ ఐటీ నాలెడ్జి హబ్‌ అభివృద్ధి కోసం మొత్తం 450 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ భూముల‌ను ఐటీ హ‌బ్ కోసం వినియోగించుకోవాల‌ని చూస్తున్నారు. ఈ విష‌య‌మై మంత్రుల క‌మిటీ స్పందిస్తూ.. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేయడంతో.. క్రమంగా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ రూపుదిద్దుకుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాల్లో వచ్చిన ప్రతి మార్పులోనూ హైదరాబాద్‌ భాగస్వామిగా ఉందని, ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో వేగంగా వస్తున్న మార్పులనూ హైదరాబాద్‌ ఐటీ రంగం అందిపుచ్చుకోవాలని సంకల్పించామ‌ని చెప్పుకొచ్చారు.

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices